బోడుప్పల్​లో రెండు క్లినిక్​లు సీజ్

బోడుప్పల్​లో రెండు క్లినిక్​లు సీజ్

మేడిపల్లి, వెలుగు: అర్హతకు మించి ట్రీట్​మెంట్ చేస్తే ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని మేడ్చల్​డీఎంహెచ్ఓ రఘునాథస్వామి హెచ్చరించారు. బోడుప్పల్​లోని శివబాలాజీ క్లినిక్, కొర్రేములలోని ఆర్ఆర్ ప్రథమ చికిత్స కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేసి, సీజ్ చేశారు. 

ఈ సందరర్భంగా రఘునాథ స్వామి మాట్లాడుతూ.. కొందరు ఆర్ఎంపీలు అర్హతకు మంచి వైద్యం చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో  డిప్యూటీ డీఎంహెచ్ఓ నారాయణరావు, నారపల్లి పీహెచ్​సీ డాక్టర్ శోభన, ఆర్ఐ పాపాని శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.