సీజ్ చేసిన వాహనాలు అమ్ముకుంటూ.. అడ్డంగా బుక్కయిన కానిస్టేబుళ్లు

 సీజ్ చేసిన వాహనాలు అమ్ముకుంటూ.. అడ్డంగా బుక్కయిన కానిస్టేబుళ్లు

అవినీతి జరిగితే అడ్డుకోవాల్సిన పోలీసులే  అక్రమాలకు పాల్పడుతున్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో సంపాదిస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను అమ్ముకుంటూ అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్. ఈ ఘటన నల్గొండ జిల్లా  తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో జరిగింది.

జిల్లాలో తనిఖీల్లో సీజ్ చేసిన వాహనాలు పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే వీటిని తక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు  ఎండి వషీమ్, ఉపేందర్. వాటాల్లో పంపకాల్లో  ఇద్దరి మధ్య  500 రూపాయల కోసం  తేలకపోవడంతో ఈ  విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పెషల్ టీమ్ తో ఎంక్వయిరీ చేయిస్తున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .

►ALSO READ హైదరాబాద్ బంజారాహిల్స్ లో కూలిపోయిన రోడ్డు : నాలాలో వాటర్ ట్యాంకర్ ఇలా పడిపోయింది..!

ఇద్దరు కానిస్టేబుళ్లు ఎండి వషీమ్, ఉపేందర్  వాహనాలు అమ్ముకోవడంతో పాటు మరికొన్ని విషయాలు విచారణలో బయటపడ్డాయి. ఇద్దరు కానిస్టేబుళ్లు స్టేషన్ పరిధిలో  కేసులను సెటిల్మెంట్ చేస్తానంటూ డబ్బులు వసూలు  చేసినట్లు  ఆరోపణలు ఉన్నాయి.   గతంలో పనిచేసిన అధికారుల వీక్నెస్ లతో వషీమ్ అనే కానిస్టేబుల్  బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్లు తెలుస్తోంది   విచారణ జరుపుతోన్న  జిల్లా ఎస్పీ ఇద్దరి కానిస్టేబుళ్లను   సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.   విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ  హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర.