
పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి రెండు దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే US నుంచి ఎటువంటి సహకారం అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
పుల్వామా దాడిలో 40 మంది జవాన్ల మృతికి పాకిస్థాన్ కారణమంటూ భారత్ వాదిస్తుండగా.. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్థాన్ చెప్పుకొస్తోంది. ఇప్పటికే దీనిపై రెండు దేశాలు ఆయా రాయబారుల ముందు నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయంపై US లోని పాకిస్థాన్ అధికారులతో చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గుటెరస్ అధికార ప్రతినిధి డుజార్రిక్ తెలిపారు.