2 కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు

2 కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు

గ్రామాల్లో దాదాపు రెండు కోట్ల  పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు వచ్చాయన్నారు ప్రధాని మోడీ. స్వామిత్వ (SWAMITVA: Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 6 రాష్ట్రాల్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ ..ఇవాళ  లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ , నానాజీ దేశ్ ముఖ్ జన్మదినం సందర్భంగా..  ఇంత గొప్ప పని జరుగుతున్నందుకు తాను సంతోషంగా ఉన్నానన్నారు. గ్రామాల్లో ఉండే వారికి స్వామిత్వ్ యోజన ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. స్వామిత్వ్ యోజన కింద సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో డ్రోన్లతో సర్వే చేసి ఆస్తులకు సంబంధించిన పక్కాగా( ప్రాపర్టీ కార్డ్) పత్రాలు అందిస్తున్నామన్నారు మోడీ. దశాబ్దాలుగా, దేశవ్యాప్తంగా గ్రామాల్లోని కోట్ల కుటుంబాలకు సొంత ఇల్లు లేదని… ఇవాళ గ్రామాల్లో దాదాపు రెండు కోట్ల మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు వచ్చాయన్నారు.

రెండు విమానాలు ఢీకొని ఐదుగురు మృతి

భారత్ లో కేసులు 70 లక్షలు..60 లక్షలు దాటిన రికవరీ

విజయవాడలో కాల్పుల కలకలం.. యువకుడు మృతి

మావోల ఘాతుకం.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య