ఇద్దరు బాలికల కిడ్నాప్ : ఆరు గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

ఇద్దరు బాలికల కిడ్నాప్ : ఆరు గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ : ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో బాలాపూర్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్టు శుక్రవారం చెప్పారు. వనస్థలిపురంలో ఏసీసీ గాంధీ నారాయణ, సీఐ సైదులుతో కలిసి మీడియాకు నిందితుల వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ కు చెందిన నర్సింహా, శోభ భార్యాభర్తలు. 10 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ బాలాపూర్ లో నివాసముంటున్ నారు. వీరికి శ్రీవాణి (7), లోహిత(10), సాయి ప్రియ(4) అనే ముగ్గురు ఆడ పిల్లలున్నారు. బాలాపూర్ కు చెందిన అలివేలు మంగ తన ఇద్దరు పిల్లలతో కలిసి వారం రోజుల క్రితం నర్సింహా, శోభ ఇంటి సమీపంలోకి షిఫ్ట్ అయింది. లోహిత, సాయి ప్రియలను గురువారం రాత్రి కిడ్నాప్ చేసి జీడిమెట్ల సూరరానికి చెందిన అనితకు రూ.10వేల చొప్పున అమ్మేసింది. అయితే మంగ తన పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమధ్య గాంధీ దవాఖానా వద్ద జీడిమెట్ల సూరారానికి చెందిన అనితను భిక్షం అడిగితే తనకు పెళ్లై పదేళ్లైనాపిల్లలు లేరని, నీ పిల్లలను ఇస్తే పెంచుకుంటానని కోరింది. నా బిడ్డలను ఇవ్వను వేరే పిల్లలున్నారు.

ఒక్కొక్కరి కి 10వేలు ఇస్తే తీసుకొస్తానని మంగ నమ్మించింది. గురువారం సాయంత్రం నర్సింహా, శోభల పిల్లలు లోహిత(10), సాయి ప్రియ(4)లకు చాక్లెట్ ఇప్తిస్తానని నమ్మించి ఎల్ బీ నగర్ మీదుగా సూరారంలోని అనిత ఇంటికి చేర్చింది. పని నుండి ఇంటికి వచ్చిన భార్యాభర్తలకు పిల్లలు కనిప చకపోవడంతో గురువారం రాత్రి బాలాపూర్ పోలీసులకు పిర్యాధు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసినిందితులను అరెస్ట్ చేశారు. టెక్నాలజీ ద్వారా కేసు ఛేదన బాలికలు కిడ్నాపైన ఆరు గంటల్లోనే సీసీ కెమె రాలు, సెల్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో అలివేలు మంగ ఇద్దరు పిల్లలను తీసుకెళ్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా సిగ్నల్ లొకేషన్ తో పిల్లలున్న ప్లేస్ కు చేరుకున్నారు. మంగతో పాటు అనితను కూడా అరెస్ట్ చేసి బాలికలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కేసు ఛేదించిన బాలాపూర్ సీఐ సైదులుతో పాటు ఎస్ఐ మధును ఏసీపీ అభినంధించారు