వీడియో: సెల్పీ కోసం నదిలోకి దిగిన అమ్మాయిలు.. నీటి ప్రవాహం పెరగడంతో..

వీడియో: సెల్పీ కోసం నదిలోకి దిగిన అమ్మాయిలు.. నీటి ప్రవాహం పెరగడంతో..

యువతకు సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. వినూత్నంగా సెల్పీ దిగాలన్న కోరికతో చాలామంది తమ ప్రాణాలను కూడా కొల్పోతున్నారు. అయినా సరే సెల్ఫీ పిచ్చిని మాత్రం వదలడం లేదు నేటి యువత. తాజాగా మధ్యప్రదేశ్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు కూడా సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. చింద్వారాలోని జున్నార్డియోకు చెందిన ఆరుగురు అమ్మాయిలు పెంచ్ నది వద్దకు విహారయాత్రకని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత నీళ్లు చూడగానే వారిలో ఉత్సాహం ఉరకలెత్తింది. అప్పుడు నదిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది. దాంతో మేఘా జావ్నే మరియు వందన త్రిపాఠి అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ దిగుదామని నదిలోకి దిగారు. వారు నదిలోకి దిగి ఫొటోలు దిగుతుండగానే.. ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఎటు వెళ్లాలో కూడా తెలియని ఆ టైంలో.. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఒక బండ రాయి ఎక్కి నిలబడ్డారు. అది చూసిన వారి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికొచ్చిన పోలీసులు, కొంతమంది స్థానికులతో కలిసి వారి ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని తాళ్ల సాయంతో కాపాడారు. ఒడ్డున వారి స్నేహితులు ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫేమస్ కావాలనుకొని ప్రమాదకరంగా సెల్ఫీలు దిగబోయి మరణించారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి 2018లో రైల్వే ట్రాక్‌ మీద సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. రైలు దూసుకురావడంతో తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు.

For More News..

నాలుగేళ్లలో ఐదుగురు పిల్లలను చంపిన తండ్రి

దేశంలో 24 గంటల్లో 48,916 కరోనా కేసులు

ఉస్మానియాను కూల్చేందుకు స్కెచ్!

ఆర్టీఏలో..ఇంటి నుంచే మరో 5 సేవలు