
న్యూఢిల్లీ: 2025-సెప్టెంబర్ నెలకు గానూ ప్లేయర్ ది మంత్ అవార్డ్ నామినీల పేర్లను ప్రకటించింది ఐసీసీ. సెప్టెంబర్ నెలలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ముగ్గురు ఆటగాళ్లను ఈ అవార్డ్ కోసం నామినేట్ చేసింది. సెప్టెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రేసులో టీమిండియా క్రికెటర్స్ హవా చూపించారు. ఈ అవార్డుకు నామినేటైన ముగ్గురిలో ఇద్దరూ టీమిండియా ఆటగాళ్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఇంకొకరు జింబాబ్వే ప్లేయర్.
టీమిండియా ఆసియా కప్-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2025 సెప్టెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు. వీరితో పాటు 2026 T20 ప్రపంచ కప్‌కు జింబాబ్వే అర్హత సాధించడంలో కీ రోల్ ప్లే చేసిన బ్రియాన్ బెన్నెట్ ఈ అవార్డ్ రేసులో నిలిచారు.
2025 ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. భారత్ ఆసియా కప్ గెలవడంలో ఓపెనర్ అభిషేక్ శర్మదే కీలక పాత్ర. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి ఇండియాను విజేతగా నిలిపాడు. ఆసియా కప్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో 44.86 సగటు, 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగుల చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ దక్కించుకున్నాడు. ఆసియా కప్‌లో అభిషేక్ బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తే.. కుల్దీ్ప్ యాదవ్ తన స్పిన్ మాయజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఏడు ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లతో పడగొట్టి భారత్‌ను టోర్నీ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ ఐసీసీ సెప్టెంబర్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు ఈ ఇద్దరూ నామినేట్ అయ్యారు. వీరితో పాటు ఈ అవార్డుకు షార్ట్ లిస్ట్ చేయబడిన బ్రియాన్ బెన్నెట్ తన అద్భుత బ్యాటింగ్‌తో జింబాబ్వే 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించేలా చేశాడు.
తొమ్మిది T20I లలో 55.22 సగటు, 165.66 స్ట్రైక్ రేట్‌తో 497 పరుగులు చేశాడు.