గన్నవరం ఎయిర్ పోర్టులో రెండు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏమైందంటే..?

గన్నవరం ఎయిర్ పోర్టులో రెండు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏమైందంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‏లోని గన్నవరం ఎయిర్ పోర్టులో రెండు ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. అసోం-హైదరాబాద్, బెంగుళూర్-హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్స్ గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలెట్లు.  హైదరాబాద్ వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించారు అధికారులు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెదర్ కండిషన్ సహకరిస్తే తిరిగి ప్రయాణం ప్రారంభిస్తామని ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ సిబ్బంది సమాచారం అందించారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం (అక్టోబర్ 25) కూడా హైదరాబాద్‎తో పాటు పలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‎లో భారీ వర్షం కురువడంతో వాతావరణం అనుకూలించక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొన్ని ఫ్లైట్ సర్వీసులను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. 

►ALSO READ | దూసుకొస్తున్న తుఫాన్ మోంతా : వైజాగ్ దగ్గర తీరం దాటే ఛాన్స్