
- మరో 8 మందికి తీవ్ర గాయాలు
కుంటాల, వెలుగు: మహారాష్ట్ర కూలీల ఆటో బోల్తా పడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఇద్దరికి సీరియస్ గా ఉండగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దత్తనగర్ కు చెందిన కూలీలు వరినాట్లు వేసేం దుకు బుధవారం ఉదయం నిర్మల్జిల్లాలోని కుంటాలకు ఆటోలో వెళ్తున్నారు. మండలంలోని దౌనెల్లి తండా ఘాట్ రోడ్డులో మూల మలుపు స్పీడ్ గా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.
ఆపై పల్టీలు కొడుతూ వెళ్లి లోయలో పడింది. దీంతో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ ఇందుల్, సుమన్ బాయి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యానికి నిజామాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. కూలీలు లక్ష్మీబాయి, సక్కుబాయి, లత, రామ్ జీ , కవిత, శాంతాబాయి, పౌర్ణిమ, రాధ బైంసా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.