
ఉగ్రవాదాన్ని అణచివేస్తామని బీరాలు పలికే అమెరికా.. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారిని సలహాదారులుగా నియమించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా వైట్ హౌజ్ సలహా సంఘంలో ఇద్దరు మాజీ జిహాదీలు, అందులో ఒకరు లష్కర్ -ఈ--తోయిబా శిక్షణ తీసుకున్న వ్యక్తిని నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అడ్వైజరీ బోర్డులోకి 2000 సంవత్సరంలో లష్కర్ -ఈ--తోయిబా ఉగ్రవాద సంస్థలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు జిహాదీలను నియమిస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకుంది.
జైతునా కాలేజ్ వ్యవస్థాపకులైన ఇస్మాయిల్ రోయర్, షేక్ హమ్జా యూసుఫ్ లు గతంలో ఇస్లామిక్ జిహాదిస్ట్, టెర్రర్ గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నారు. స్మాయిల్ రోయర్, షేక్ హమ్జా యూసుఫ్ లను వైట్ సలహాదారులుగా నియమించుకున్నట్లు ట్రంప్ అనుచులు లారా లూమర్ తెలిపారు.
ట్రంప్ కు జాతీయ భద్రతా మండలి సలహాదారుగా వ్యవహరించిన లూమర్ ను ఇటీవలే తొలగించడం జరిగింది. రోయర్ నియామకం దారణమని లూమర్ అన్నారు. అయితే వైట్ హౌజ్ సమాచారం ప్రకారం.. ఇస్లాం, రిలీజియస్ ఫ్రీడమ్ యాక్షన్ టీమ్ కు డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు.
రోయర్ 1992లో ఇస్లాంను స్వీకరించాడు. ‘వర్జీనియా జిహాదీ నెట్ వర్క్’ ద్వారా అమెరికా పౌరులపై ఉగ్రదాడులకు పాల్పడిన కేసులో 2004 లో దోషిగా తేల్చిన యూఎస్ కోర్టు.. 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఆల్ ఖైదా, LeT గ్రూప్ లకు మారణాయుధాలు సరఫరా చేస్తూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు అప్పట్లో నేరం రుజువైంది. 13 ఏళ్ల శిక్ష అనుభవించిన రోయర్ కు ఇలాంటి బాధ్యతలు ఇవ్వడం దారుణమని లారా లూమర్ ఆందోళన వ్యక్తం చేశారు.
►ALSO READ | ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ స్ట్రైక్స్.. 9 మంది మృతి
ఇక రెండవ వ్యక్తి షేక్ హమ్జా యూసుఫ్ అమెరికాలో తొలి లిబరల్ ముస్లిం ఆర్ట్స్ కాలేజ్ (జైతునా) స్థాపించాడు. బెర్కెర్లీ గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్ ఇస్లామిక్ సెంటర్ కు సలహాదారుగా వ్యవహరించనున్నాడు. ఇతనికి కూడా జిహాదీ బ్యాగ్రౌండ్ ఉన్నట్లు లూమర్ తెలిపారు. జిహాద్ పేరుతో ముస్లిం బ్రదర్ హుడ్, హమాస్ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు ఆమె తెలిపారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సొంత దేశానికి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. అంతే కాకుండా భారత్ పైకి ఉగ్రదాడులకు పురికొల్పిన, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారిని ఎలా నియమించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
లష్కరే తోయిబా దశాబ్దాల కాలంగా భారత్ లో ఉగ్ర ఉగ్రదాడులకు పాల్పడుతూ వస్తోంది. 2001 లో పార్లమెంట్ పై దాడి, 2008 ముంబై దాడుల వెనుక ఈ సంస్థ ఉందన్నది తెలిసిన విషయమే. ఇలాంటి తరుణంలో ఉగ్ర సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారిని నియమించడం సరికాదని భారత విశ్లేషకులు విమర్శిస్తున్నారు.