బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెయిన్ బో ఆస్పత్రిలో రెయిన్బో హాస్పిటల్ ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న త్రిభువన్ రాయి (23)  అసిస్టెంట్ కుక్ గా ఉన్న ఉపేందర్ కుమార్ దాస్ (29) రోడ్డు దాటుతుండగా కారు వచ్చి వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు టెస్ట్ చేయగా వారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు.