
నల్గొండ జిల్లా: కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న డీసీఎంని కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారని తెలిపాడు డీసీఎం డ్రైవర్. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.