
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్ లారీ..స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్క, తమ్ముడు అక్కడికక్కడే చనిపోయారు. అమీన్ పూర్ కు చెందిన సుష్మాలత, సాయి తేజ స్కూటీ పై మీ సేవకు వెళ్తుంగా రామచంద్రపురం బస్ స్టాప్ దగ్గర స్కూటీ ని రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ ఢీ కొట్టింది. వారిద్దరూ లారీ చక్రాల కింద పడి చనిపోయారు. కూతురు,కొడుకు చనిపోయారనే విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
స్కూటీనీ ఢీ కొట్టి పారిపోతున్న లారీ ని పట్టుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.