చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం ....బీసీ కుల సంఘాల జేఏసీ

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం ....బీసీ కుల సంఘాల జేఏసీ

ముషీరాబాద్, వెలుగు: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతామని బీసీ కుల సంఘాల జేఏసీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్​చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ అనంత రామ్మూర్తి గౌడ్, ఎంబీసీ విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ బడే సాహెబ్ ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా బీసీ సంఘాల నాయకులు విజయ, ఆర్.నారగోని, జేఏసీ కన్వీనర్లు రాజారాం యాదవ్, బోళ్ల కరుణాకర్ ముదిరాజ్, అయిలి వెంకన్న గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్,రాచాల యుగంధర్ గౌడ్, గుజ్జ సత్యం, అల్లంపల్లి రామకోటి హాజరై మాట్లాడారు.42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. త్వరలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీల యుద్ధభేరి నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు నరేందర్, శ్రీధర్, రామకోటి, లక్ష్మి, లతా సింగ్, మంజుల తదితరులు పాల్గొన్నారు.