314 మంది బాలికలకు రక్త పరీక్షలు

314 మంది బాలికలకు రక్త పరీక్షలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న బాలికలకు ప్రత్యేక వైద్య సహాయం అందించనున్నట్లు సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత తెలిపారు. ఆదివారం ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, మంచాల, రంగాపూర్ లలో314 మంది కిశోర బాలికలకు కోటివిటి సంస్థ సహకారంతో రక్త పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. 

రక్తహీనత నివారణపై బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. రక్తహీనతతో బాధ పడుతున్న బాలికలకు వైద్యుల సూచన మేరకు 3 నెలలపాటు పౌష్టికాహారం, అవసరమైన మందులు అందించనున్నట్లు తెలిపారు. సేవా భారతి రాష్ట్ర కార్యసమితి సభ్యురాలు అనురాధ , డాక్టర్లు జై సందేశ్, హేమంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.