బషీర్‌బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఆయా పార్టీ నాయకులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్‌కుమార్, బీజేపీ నుంచి ఎస్. ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికైన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. తరువాత జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఓటర్లు తమ సమస్యలను వివరించారు.
రహమత్‌నగర్‌లో ఇరుకైన రోడ్లు, రోడ్ల ఆక్రమణలు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, షేక్‌పేటలో బస్సు సౌకర్యం లేకపోవడం, యూసఫ్‌గూడ ఇందిరానగర్‌లో నల్లా కనెక్షన్ లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఎన్నో ఏండ్లుగా హామీలు మాత్రమే వింటున్నామని, పరిష్కారం మాత్రం కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల నేరచరిత్ర కూడా చర్చకు వస్తూ, బీజేపీ అభ్యర్థిపై 5, బీఆర్ఎస్ అభ్యర్థిపై 1, కాంగ్రెస్ అభ్యర్థిపై 7 కేసులు ఉన్నాయని తెలిపారు.
క్లీన్ రికార్డు ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సిందని ఓటర్లు అభిప్రాయపడ్డారు. నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం. పద్మనాభరెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించారు.
