
హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఆగిఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు..ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.