
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందారు. గదిరాస్ పరిధిలోని మంకపల్ వద్ద జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించారు. చనిపోయిన వారు గంధాదుర్ (మలంగీర్ ఏరియా కమిటీ కమాండర్), అయుత్ గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయిన గంధాదుర్ అనే నక్సల్ తలపై రూ.5 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.