వేర్వేరు చోట్ల ఇద్దరు అనుమానాస్పద మృతి

వేర్వేరు చోట్ల ఇద్దరు అనుమానాస్పద మృతి

వికారాబాద్​, వెలుగు: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. నవాబుపేట ఎస్సై పుండ్లిక్​ తెలిపిన ప్రకారం.. నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన అటుగాళ్ల ఆనందం(42) బుధవారం ఉదయం మాంసం తీసుకువస్తానని చెప్పి వికారాబాద్ కు బైక్​పై వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాలేదు. గురువారం ఉదయం కేశవపల్లి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంకిరెడ్డిపల్లిలో మరొకరు..

కీసర: యాదాద్రి జిల్లా బొమ్మలరామారానికి చెందిన వల్లపు రమేశ్​ కొంతకాలంగా అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల మల్లేశ్​ వ్యవసాయ పొలం వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పశువుల కొట్టం వద్ద రక్తపు మడుగులో అతడి మృతదేహం కనిపించింది. దీంతో మృతుడి బంధువులు యజమాని మల్లేశ్​ పనేనని అనుమానించి ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారు.