సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా మరో రెండు డైట్ కాలేజీలు..కరీంనగర్, మెదక్ కాలేజీలకు కేంద్రం అనుమతులు

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా మరో రెండు డైట్ కాలేజీలు..కరీంనగర్, మెదక్ కాలేజీలకు కేంద్రం అనుమతులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) కాలేజీలను బలోపేతం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగా ఆయా కాలేజీలను అప్​డేట్ చేస్తూ వాటిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లుగా మారుస్తోంది. తెలంగాణలో గతేడాది రెండు కాలేజీలకు అనుమతులు ఇవ్వగా.. ఈ విద్యా సంవత్సరం కూడా మరో రెండు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది.

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా డైట్ కాలేజీలను డెవలప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంట్లో భాగంగా డైట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చుతున్నారు. ఈ కొత్త స్కీమ్‌తో డైట్ కాలేజీల్లోని సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయి. ఎక్సలెన్సీల్లో ఇంటర్మీడియెట్ తరగతులు చెప్పే లెక్చరర్ల వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.  

వచ్చే ఏడాది ఆదిలాబాద్, నిజామాబాద్ 

గతేడాది మహబూబ్ నగర్, ఖమ్మం  డైట్ కాలేజీలను ఎక్సలెన్సీలుగా మార్చేందుకు కేంద్రం పర్మిషన్  ఇచ్చింది.  రూ.29.96 కోట్లతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.  వాటిలో 20.46 కోట్లకు కేంద్రం అంగీకరించింది.  ఈరూ.15 కోట్లు రిలీజ్ చేసింది. రెండోదశలో ఈ విద్యా సంవత్సరం  కరీంనగర్, మెదక్ డైట్‌లనూ ఎక్సలెన్స్ సెంటర్లుగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

వీటిలో మెదక్ కాలేజీకి  రూ.17.49 కోట్లు,  కరీంనగర్ కాలేజీకి రూ.19.92 కోట్ల ప్రతిపాదనలు పంపించారు. ఈ రెండు కాలేజీలకు కలిపి రూ.26.96 కోట్లకు కేంద్రం అప్రూవ్ చేసింది. కాగా, వచ్చే ఏడాది ఆదిలాబాద్, నిజామాబాద్ డైట్ కాలేజీలను ఎక్సలెన్స్​ లుగా మార్చాలనే ప్రతపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది.