
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలంలో రెండు గ్రామాలను జీపీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండలంలోని కొత్తగా రాచర్ల బాకురుపల్లె, సేవాలాల్ తండాలను జీపీలుగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు.
మండలంలో ఇప్పటికే 24 జీపీలుగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటీవల గవర్నర్ ఆమోదించారు. జీపీ భవనాలకు సంబంధించి తాత్కాలికంగా రాచర్ల బాకురుపల్లె , సేవాలాల్ తండాలలో భవనాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య గురువారం మీడియాకు తెలిపారు.