రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ ఐటీఐలు.. ఒకటి మేడ్చల్, రెండోది రంగారెడ్డి జిల్లాలో

రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ ఐటీఐలు.. ఒకటి మేడ్చల్, రెండోది రంగారెడ్డి జిల్లాలో

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్చల్– మల్కాజ్‌‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌‌స్టిట్యూట్‌‌(ఐటీఐ)ల స్థాపనకు అనుమతులు మంజూరు చేస్తూ కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ జీవోల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్‌‌గిరి జిల్లా బాలానగర్ ఐడీపీఎల్ ఐడీఏ పరిధిలో ‘డైనమిక్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఐటీఐ ఏర్పాటు కానుంది. ఇందులో మెషినిస్ట్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో ‘హార్ట్‌‌ఫుల్‌‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మరో ఐటీఐ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కార్పెంట్రీ, వెల్డింగ్‌‌, ‘ఫుడ్ అండ్​ బెవరేజెస్’ ట్రేడ్స్‌‌లో శిక్షణ ఇవ్వనున్నారు.