- హైదరాబాద్‌కు చెందిన చేతన రెడ్డికి సొంత రాష్ట్ర కేడర్లు
- రాజస్తాన్‌కు చెందిన హర్ష దబేరియాకు తెలంగాణ కేడర్ కేటాయింపు
- ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న 135 మంది ఐపీఎస్‌లు, 16 మంది ఫారిన్ ఆఫీస
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేడర్‌లోకి కొత్తగా ఇద్దరు ట్రైనీ ఐపీఎస్‌లకు అవకాశం దక్కింది. రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఎన్. చేతన రెడ్డి, రాజస్తాన్‌కు చెందిన హర్ష్ డబేరియాను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను రాజస్తాన్, మహారాష్ట్ర కేడర్లకు కేటాయించారు. ఈ మేరకు గురువారం అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే వివరాలు వెల్లడించారు.
అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 135 మంది ట్రైనీ ఐపీఎస్‌లు,16 మంది నేపాల్, భూటన్, మాల్దీవులకు చెందిన ఫారిన్ పోలీస్ ఆఫీసర్లు శనివారం దీక్షాంత్ పరేడ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరేడ్‌కు కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రాథమిక శిక్షణ వివరాలను వెల్లడించారు. ఆర్గనైజ్డ్ క్రైమ్, సైబర్ నేరాలు, టెర్రరిజం ప్రస్తుత పోలీసుల ముందున్న పెను సవాళ్లని చెప్పారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారంలో విచారణ కొనసాతున్నదని పేర్కొన్నారు.
16 మంది ఫారిన్ పోలీసులు సహా151 మందికి శిక్షణ
78వ రెగ్యులర్ రిక్రూట్స్(78ఆర్ఆర్) బ్యాచ్‌లో మొత్తం 151 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. వీరిలో 135 మంది భారతీయ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారులు కాగా, మరో 16 మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన విదేశీ అధికారులు ఉన్నారు. ఈ బ్యాచ్‌లో 37 మంది మహిళా అధికారులు ఉండటం విశేషం. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 15 వారాల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న అనంతరం, 2025 డిసెంబర్8న ఈ బ్యాచ్ హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుంది.
49 వారాల ప్రాథమిక శిక్షణలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్, దేశ అంతర్గత భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, క్రిప్టో కరెన్సీ మోసాలు, ఆర్థిక నేరాలు, డార్క్‌నెట్, ఏఐ, సోషల్‌మీడియా సంబంధిత నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి కేటాయించిన రాష్ట్ర కేడర్లలో 29 వారాల డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనంతరం, 2027 జూన్21 నుంచి అకాడమీలో తొమ్మిది వారాల పాటు రెండో దశ శిక్షణ ప్రారంభం కానుంది.
4 వ ప్రయత్నంలో ర్యాంక్
అమ్మానాన్న డాక్టర్లు. నేను చిన్ననాటి నుంచే పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను. మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. బిట్స్‌లో ఇంజనీరింగ్ చదివాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను 4 వ ప్రయత్నంలో 110వ ర్యాంక్ సాధించాను. ట్రైనింగ్‌లో నేర్చుకున్న లా ఎన్ఫోర్స్మెంట్ మేరకే విధులు నిర్వర్తిస్తాను. సామాన్యులకు న్యాయం జరిగేలా పనిచేస్తాను.
- ఎన్ చేతన రెడ్డి, ట్రైనీ ఐపీఎస్, హైదరాబాద్.
తెలంగాణకు చెందిన ట్రైనీ
ఐపీస్‌లు, కేడర్ కేటాయింపులు
పేరు సొంత రాష్ట్రం కేడర్
కేటాయింపు
ఎన్. చేతన రెడ్డి తెలంగాణ తెలంగాణ
హర్ష దబేరియా రాజస్తాన్ తెలంగాణ
తెలంగాణకు చెందిన ట్రైనీ ఐపీస్లకు,
వివిధ రాష్ట్రాల కేడర్ కేటాయింపులు
కె. అర్పిత ఉత్తర్‌ప్రదేశ్
చౌహన్ రాజ్‌కుమార్ రాజస్తాన్
మెరుగు కౌశిక్ మహారాష్ట్ర
పెంకీసు ధీరజ్ రెడ్డి మహారాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు
కేటాయించిన ట్రైనీ ఐపీఎస్‌ల వివరాలు
ట్రైనీ ఐపీఎస్ పేరు సొంతరాష్ట్రం
చక్కా స్నేహిత్ ఆంధ్రప్రదేశ్
చల్లా పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్
గణేశ్న భానుశ్రీ ఆంధ్రప్రదేశ్
ముకుంద్ సింగ్ చాహర్ మధ్యప్రదేశ్
నిఖిల్ యాదవ్ ఢిల్లీ
షా మొహద్ ఇమ్రాన్ ఉత్తరప్రదేశ్
ఉర్మి సిన్హా వెస్ట్‌బెంగాల్
వీర్ రిషికేశ్ నాగనాథ్ గోవా
