న్యూఢిల్లీ: ఇండస్ ఇండ్ బ్యాంకుకు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. కస్టమర్ మేనేజ్ మెంట్ హెడ్ రాణా విక్రమ్ ఆనంద్, వెల్త్, పారా బ్యాంకింగ్ హెడ్ అనీష్ బెహల్ తమ పదవులను వదులుకున్నారు. బ్యాంక్ వెలుపల కొత్త అవకాశాల కోసం తాము తప్పుకుంటున్నట్లు వారు తెలిపారు.
గత కొన్ని నెలలుగా ఈ బ్యాంక్ లో కీలక స్థాయి అధికారులు వరుసగా వెళ్లిపోతున్నారు. దీంతో బ్యాంక్ తన నాయకత్వ బృందాన్ని బలోపేతం చేసేందుకు కొత్త నియామకాలు కూడా చేపట్టింది. హోల్ సేల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ గా గణేష్ శంకరన్, చీఫ్ డేటా ఆఫీసర్ గా బాలాజీని, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ గా అమితాబ్‌ను నియమించింది.
