
నల్గొండ జిల్లా: దామరచెర్ల మండలం కొండ్రపోల్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు నెల్లూరుకు చెందిన కమలాకర్ రెడ్డి(40), నందగోపాల్ రెడ్డి(70)గా గుర్తించారు.
పేషెంట్ ని అంబులెన్స్ లో నెల్లూరు నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడ్డవారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం మార్చురీకి తరలించారు.