జమ్మూలో ఇద్దరు పోలీసుల అనుమానాస్పద మృతి.. బుల్లెట్ గాయాలతో డెడ్ బాడీలు లభ్యం

జమ్మూలో ఇద్దరు పోలీసుల  అనుమానాస్పద మృతి.. బుల్లెట్ గాయాలతో డెడ్ బాడీలు లభ్యం

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవో) విభాగానికి చెందిన ఇద్దరు అధికారుల మృతదేహాలు బుల్లెట్ గాయాలతో అనుమానాస్పద స్థితిలో లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను రాష్పాల్ కుమార్ (40), బబీ చంద్ (54)గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల దచ్చన్-–మార్వా ప్రాంతంలో బుధవారం గస్తీ నిర్వహిస్తున్న ఈ అధికారులు, ధేర్నా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విధుల్లో ఉన్న సహచరుల స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా అదృశ్యమయ్యారు.

 అనంతరం కాసేపటికే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే వీరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఎంతసేపటికీ వీరు పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకోకపోవడంతో అదృశ్యమయ్యారని నిర్ధారించుకున్న అధికారులు సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశారు. గురువారం ఉదయం ధేర్నా టాప్ వద్ద బుల్లెట్ గాయాలతో వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

 మాటువేసిన ఉగ్రవాదులు వీరిపై కాల్పులు జరిపి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం వీరి వద్ద ఉన్న ఇన్సాస్, .303 రైఫిళ్లను ఎత్తుకెళ్లారు. ముష్కరుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. కిష్త్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో టెర్రరిస్టుల ఏరివేతకు బలగాలు వరుస ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల పలువురు కీలక టెర్రరిస్టులు హతమవ్వడంతో ఆ ప్రాంతంలో వారి ఉనికి దాదాపు బలహీనపడింది. ఇలాంటి సమయంలో ఈ దాడి జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.