
న్యూఢిల్లీ: లగేజ్ బ్యాగ్‌లను తయారు చేసే వీఐపీ ఇండస్ట్రీస్‌లో 6.22శాతం వాటాను ప్రమోటర్ కంపెనీలు కిడ్డీ ప్లాస్ట్ లిమిటెడ్, పిరమల్ విభూతి ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.343 కోట్లకు విక్రయించాయి. బీఎస్‌ఈ బల్క్ డీల్ డేటా ప్రకారం, 88.40 లక్షల షేర్లను రూ.388–388.25 ధర వద్ద అమ్మాయి. ఈ విక్రయంతో ప్రమోటర్ గ్రూప్ మొత్తం వాటా 51.73శాతం నుంచి 45.51శాతానికి తగ్గింది.
ఇదే సమయంలో, ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మల్టిపుల్స్ ఈక్విటీ తన అనుబంధ సంస్థలు మల్టిపుల్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 4, మల్టిపుల్స్ ప్రైవేట్ ఈక్విటీ గిఫ్ట్ ఫండ్ 4 ద్వారా వీఐసీ ఇండస్ట్రీస్‌లో 60.11 లక్షల షేర్ల (4.23శాతం వాటా)ను కొనుగోలు చేసింది.
సంవిభాగ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిఎట్ 22.12 లక్షల షేర్లను (1.55శాతాన్ని) కొనుగోలు చేసింది. మొత్తం 82.23 లక్షల షేర్లు (5.8శాతం) రూ.319.07 కోట్లకు చేతులు మారాయి. మిగిలిన షేర్లను కొన్నవారి వివరాలు బయటకు రాలేదు. వీఐపీ ఇండస్ట్రీస్ షేరు ధర బీఎస్‌ఈలో 4.01శాతం తగ్గి రూ.409 వద్ద ముగిసింది.