కరీంనగర్ జిల్లా నుంచి..ఇద్దరు అమాత్యులు

కరీంనగర్ జిల్లా నుంచి..ఇద్దరు అమాత్యులు
  •      సీనియర్​ లీడర్​ శ్రీధర్ బాబుకు మరోసారి మంత్రి పదవి 
  •      పొన్నంకు డబుల్​ ధమాకా 
  •     ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  •     ప్లేస్ మార్చడంతో కలిసొచ్చిన అదృష్టం 

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర కేబినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరికి చోటుదక్కింది. మంథని ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడర్​ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు హుస్నాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి పదవులు దక్కాయి. పొన్నంకు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడం, పార్టీకి అందించిన సేవలతోపాటు బీసీ సామాజికవర్గంలో సీనియర్ లీడర్ కావడంతో మంత్రి పదవి దక్కినట్లు తెలిసింది. కాగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. కాంగ్రెస్ సర్కార్ లో ప్రస్తుతానికి ఇద్దరికే అవకాశం దక్కింది. మంత్రి పదవుల్లో ఇద్దరికీ కీలకశాఖలు కేటాయించే అవకాశం ఉంది. 

జూనియర్లకు నో ఛాన్స్

ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన  8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు కొత్తవారే. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండగా, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గతంలో ఒకసారి ఎమెల్యేగా గెలిచారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ 2009–14 వరకు కరీంనగర్ ఎంపీగా పని చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరిలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. 

పొన్నంకు కలిసొచ్చిన ప్లేస్ చేంజ్.. 

అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం మారడం పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలిసివచ్చింది. తెలంగాణ ఉద్యమంతోపాటు 2014లో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర విభజన బిల్లు టైంలోనూ ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. అయినప్పటికీ 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీ ఎన్నికల టైంలో ఆయనకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన ఈ సారి ఎన్నికల్లో మకాం మార్చారు. అక్కడ అప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాదని పొన్నం ప్రభాకర్ కు హైకమాండ్​ టికెట్ ఇచ్చింది.

ప్రవీణ్ రెడ్డితోపాటు కేడర్​కూడా పొన్నంకు సహకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబుపై విజయం సాధించారు. చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు ప్లేస్ చేంజ్ చేయడమే పొన్నంకు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో డబుల్ ధమాకా కొట్టినట్లయింది. 

తండ్రి మరణంతో రాజకీయాల్లోకి శ్రీధర్ బాబు..

మంత్రి శ్రీధర్ బాబు తన తండ్రి, దివంగత స్పీకర్ శ్రీపాదరావు మరణంతో  రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన ఆయన 1998లో ఏపీ హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు.1999లో శ్రీపాదరావును పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చిచంపడంతో తండ్రి వారసత్వంతో శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2004లో మరోసారి గెలిచి కాంగ్రెస్ సర్కార్ లో విప్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2018లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. 2010 నుంచి 2014 వరకు ఆయన సివిల్ సప్లై, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లోపూ గెలిచిన ఆయనకు కీలక శాఖ  దక్కే అవకాశం ఉంది.