- ఉరివేసుకొని ఒకరు, బిల్డింగ్ పైనుంచి దూకి మరొకరు సూసైడ్
- కొంతకాలంగా సహజీవనం చేస్తున్న జంట
- మృతులు తెలంగాణ వాసులుగా గుర్తింపు
ములుగు, వెలుగు: తెలంగాణకు చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఉరివేసుకొని ఒకరు, బిల్డింగ్‌పై నుంచి దూకి మరొకరు సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నసాగర్ కు చెందిన భానుచందర్ రెడ్డి(32) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.
మేడ్చల్ జిల్లాకు చెందిన షాజియా సిరాజ్(31) కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. వీరిద్దరూ అక్కడే ఓ అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా ఆమె మేడ్చల్ కువచ్చింది. ఆదివారం తిరిగి బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌కు భానుచందర్ రెడ్డి ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే మృతుడి తమ్ముడు మణికాంత్‌రెడ్డికి ఆమె ఫోన్ చేసి విషయం చెప్పింది. అనంతరం అపార్ట్‌మెంట్ 17 అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
