రెండు ఆత్మలు ఒకటయ్యాయా?

రెండు ఆత్మలు ఒకటయ్యాయా?

అఖిల్​ (త్రినాథ్ వర్మ) తండ్రికి ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ గురించి పట్టించుకోకుండా వేరే ఉద్యోగ యత్నాలు చేస్తుంటాడు అఖిల్. ఒంటరిగా ఉండే అతనికి డ్రగ్స్ అలవాటవుతాయి. అతనికి ప్రియ (మోనికా రెడ్డి) అనే గర్ల్​ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెని పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్​ ఆఫీసులో పనులు చూడమని ఫ్రెండ్స్​కి చెప్తాడు. ప్రియను తీసుకొచ్చేందుకు వెళ్లిన అఖిల్​కి పెద్ద షాక్​ తగులుతుంది. ప్రియ వేరే అబ్బాయితో చనువుగా ఉంటుంది. అది చూసిన అఖిల్ సూసైడ్ ఎటెంప్ట్​ చేస్తాడు. తన బాడీ హాస్పిటల్​లో బెడ్ పై ఉంటుంది. కానీ, అతని ఆత్మ బయటికి వచ్చేస్తుంది. హాస్పిటల్ బయట ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది అతనికి. ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అవుతారు. ఆమెవరు? ఆమెకు ఏమైంది? నిజ జీవితంలో వాళ్లు కలిశారా? లేదా? వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, మ్యూజిక్​ మాత్రమే ప్లస్​. మిగతా అన్ని విషయాల్లో మైనస్​లే ఎక్కువ కనిపిస్తాయి. ఖాళీ టైం ఉంది. ఏదైనా ఒక లవ్​ స్టోరీ సినిమా చూడాలి అనుకుంటే ఇది చూడొచ్చు. 

టైటిల్: టూ సోల్స్
డైరెక్షన్: శ్రవణ్ కుమార్
కాస్ట్ :త్రినాథ్ వర్మ కదిలిండి, భావన సాగి, ప్రవీణ్, మోనికా రెడ్డి, రవితేజ మహాదాస్యం
లాంగ్వేజ్: తెలుగుల
ఫ్లాట్ ఫాం: ఈటీవీ విన్