
మేడ్చల్ : ఉన్నత చదువుల చదివించి వారి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని కొందరు విద్యార్థులు వమ్ము చేస్తున్నారు. దురాలవాట్లకు బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలో దుండిగల్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అతి వేగంతో స్పోర్ట్ బైక్ పై వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి నిజామాబాద్ సెంట్ పీటర్ కాలేజికు చెందిన విశాల్(21), సుజిత్ కుమార్(23)లు స్పోర్ట్స్ బైక్ (TR..09EG 2104 )పై అతి వేగం గా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ ఢీ కొని మృత్యువాత పడ్డారు. మృతులు సెయింట్ పీటర్స్ కాలేజీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో వారి దగ్గర ఉన్న ఎరుపు రంగు బ్యాంకులో కేజి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు.