
శ్రీనగర్: పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరి నాలాలోని సర్జీవన్ ఏరియా(లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) గుండా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఇండియన్ ఆర్మీ అడ్డగించడంతో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ఇండియన్ ఆర్మీ కూడా ఎదురు కాల్పులు జరపగా.. ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
ఘటనాస్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామగ్రి, పాకిస్తానీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. "బుధవారం యురి నాలా వద్ద సర్జీవన్ ప్రాంతంలో సుమారు ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులు మన దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని విఫలం చేశాం. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రి, యుద్ధ సంబంధిత వస్తువులను, పాకిస్తానీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నం" అని చినార్ కోర్ ట్వీట్ చేసింది.