దర్జాగా బైక్ పై వచ్చి సెల్ ఫోన్ కొట్టేశారు

దర్జాగా బైక్ పై వచ్చి సెల్ ఫోన్ కొట్టేశారు

64 కళల్లో దొంగతనం కూడా ఒక కళ. ప్రస్తుత సమాజంలో అన్ని కళలతో ..చోర కళ కూడా పోటీపడుతుంది. దొంగతనం చేయడంలో ఆరి తేరాడో వ్యక్తి. రోడ్డుపై పడ్డానని లేచేందుకు  సాయం చేయాలని కేకలు వేయడంతో అతని వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు.  ఇంతలో మరో వ్యక్తి వచ్చి.. అతని దగ్గరున్న సెల్ ఫోన్ ను చాకచక్యంగా కొట్డేశాడు.  

వివరాల్లోకి వెళ్తే..

దర్జాగా బైక్ పై వచ్చి సెల్ ఫోన్ కొట్టేశారు. గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం వెళ్లిన శ్యామ్ సన్ అనే వ్యక్తి దగ్గర నుండి దొంగలు పక్కా ప్లాన్ తో ఫోన్ కొట్టేశారు. బైక్ పై నుంచి కింద పడినట్లు నమ్మించి.. ఫోన్ దొంగతనం చేశారు. ఈ ఘటన మైలవరంలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో నివాసం ఉండే రిటైర్డ్  బ్యాంక్ మేనేజర్ శ్యామ్ సన్ అనే వ్యక్తి స్థానిక సాయి మౌనిక గ్యాస్ ఏజెన్సీకి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం వెళ్లాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై కింద పడినట్లు నటించి... పైకి లేచేందుకు  సహాయం చేయాలంటూ కేకలు వేశాడు.

శ్యామ్ సన్ కింద పడిన వ్యక్తిని లేపేందుకు పరుగు పరుగున వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడే ఉన్న మరో వ్యక్తి శ్యామ్ సన్ జేబులో ఉన్న  42 వేల విలువైన సెల్ ఫోన్ ను చాకచక్యంగా కొట్టేశాడు. ఆ తర్వాత అక్కడినుంచి ఇద్దరూ బైక్ పై పరారయ్యారు. గ్యాస్ కంపెనీ వద్దగల సీసీ టీవీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డ్ అయింది. పక్క ప్రణాళికతో సెల్ ఫోన్ దొంగతనం చేసినట్టుగా కనపడుతుంది. అనంతరం శ్యామ్ సన్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.