ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు

ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు

న్యూఢిల్లీ: తిహాడ్ జైలు ఖైదీలకు ఇక నుంచి క్రీడల్లో శిక్షణ అందనుంది. ఆరు ఆటల్లో ప్రొఫెషనల్స్ తో ట్రెయినింగ్ ఇప్పించేందుకు ఢిల్లీ జైళ్ల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ తోనూ శిక్షణ ఇప్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిహాడ్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న సుశీల్ కుమార్.. ఇకపై ఖైదీలకు కుస్తీ పాఠాలు, ఫిట్ నెస్ క్లాసులు బోధించనున్నాడు. ఇప్పటికే ఆరు నుంచి ఏడుగురు ఖైదీలు అతడి వద్ద కోచింగ్ తీసుకుంటున్నారని ఢిల్లీ జైళ్ల శాఖ పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సీఎస్ఎఆర్ ప్రాజెక్టులో భాగంగా ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, చెస్, క్యారమ్స్ గేమ్స్ లో ట్రెయినింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. ఇకపోతే, సహచర రెజ్లర్ సాగర్ ధన్కర్ మృతికి కారణమైనట్లు ఆరోపణలు రుజువు కావడంతో సుశీల్ ను తిహాడ్ కు తరలించారు. 

మరిన్ని వార్తల కోసం:

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా