యమహా బైక్స్​పై ఆఫర్లు

యమహా బైక్స్​పై ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: టూవీలర్​ మేకర్​ యమ హా పండుగ సీజన్​ పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇవి ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 150 సీసీ ఎఫ్​జెడ్​ మోడల్స్, ఫాసినో 125 ఎఫ్​ఐ హైబ్రిడ్‌పై  వర్తిస్తుంది.  ఈ బైక్స్​ కొంటే రూ.మూడు వేల విలువైన ఇన్​స్టంట్​ క్యాష్​బ్యాక్ ఇస్తారు.

ఫైనాన్స్ పథకాలు కూడా ఉన్నాయి. రూ. 2,999 డౌన్​పేమెంట్​ చెల్లించి యమహా టూవీలర్లను కొనొచ్చు. యమహా ప్రస్తుతం వైజెడ్​ఎఫ్​-ఆర్​15 వీ4 , వైజెడ్​ఎఫ్​-ఆర్​ 15ఎస్​ వీ3 , ఎంటీ-15 వీ2, ఎఫ్​జెడ్​ఎస్​ఎఫ్​ఐ వెర్షన్ 4.0 , ఎఫ్​జెడ్ ​ఎస్​ఎఫ్​ఐ వెర్షన్ 3.0  , ఎఫ్​జెడ్​-ఎఫ్​ఐ, ఎఫ్​జెడ్​-ఎక్స్​ , ఫాసినో 125, ఎఫ్​ఐ హైబ్రిడ్ తదితర బండ్లను అమ్ముతోంది.