
షాపుల్లోకి కస్టమర్ల మాదిరిగా వెళ్లి.. సిబ్బందిని మాటల్లో పెట్టి చోరీలకు పాల్పడుతున్నారు కొందరు మహిళలు. ఎవరూ చూడకపోతే విలువైన వస్తువులను ఈజీగా కొట్టేస్తున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. షాపు సిబ్బందిని మాటల్లో పెట్టి బంగారు ఆభరణాలను కొట్టేసే ప్లాన్ చేసిన ఇద్దరు మహిళలను చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఓనర్లు.
పలమనేరు లోని స్థానిక బాలాజీ స్వర్ణ మహల్ బంగారు దుకాణంలో మోసం చేయడానికి వచ్చి ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయిన ఘటన గురువారం (సెప్టెంబర్ 18) చోటుచేసుకుంది. బాలాజి స్వర్ణ మహల్ దుకాణానికి ఇద్దరు మహిళలు బంగారు కొనడానికి వచ్చి 8 గ్రాముల నగ తీసుకుని.. వారి వద్దనున్న 2 గ్రాముల నగను అక్కడ ఉంచారు.
గమనించిన సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వెంటనే పోలీసులు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఇద్దరు మహిళలు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు.