V6 News

మహాలక్ష్మీ పథకం: ఉచిత బస్సు ప్రయాణానికి రెండేళ్లు పూర్తి.. ఈ స్కీమ్తో ఎంత మంచి జరిగిందంటే..

మహాలక్ష్మీ పథకం: ఉచిత బస్సు ప్రయాణానికి రెండేళ్లు పూర్తి.. ఈ స్కీమ్తో ఎంత మంచి జరిగిందంటే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకంలో మొదటగా ప్రారంభించిన స్కీమ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ప్రారంభించి ఇవాళ్టితో (డిసెంబర్ 09) సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు , సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ- మంత్రి పొన్నం ప్రభాకర్.

2023 , డిసెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రెండేళ్లు పూర్తి చేసుకుని ఇప్పటి వరకు 251 కోట్ల  మంది మహిళలు 8 వేల 459 కోట్ల విలువైన ప్రయాణం పొందగలిగారు.

ఉచిత బస్సు సౌకర్యం ద్వారా కుటుంబాల బంధుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన , హాస్పిటల్  చికిత్సలు , విద్యా వ్యవస్థ మెరుగుపరచడం ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇదేకాకుండా అనేక రకాలుగా మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.

 సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించుకున్న ఈ పథకం రెండు సంవత్సరాలు గా విజయవంతంగా మహిళా సాధికారత కి ఉపయోగపడుతుందని అన్నారు. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు.. మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.