సరూర్ నగర్లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

సరూర్ నగర్లో  మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

హైదరాబాద్  సరూర్ నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవంబర్ 23న వేకువజామున 5 గంటలకు ఓ బైక్ అదుపు తప్పి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టింది.  ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ నంబర్ 1618 దగ్గర ఈ  ప్రమాదం  జరిగింది. 

మోహన్ నగర్, టెలిఫోన్ కాలనీ ప్రాంతాలకు చెందిన ఇద్దరు స్నేహితులు మధు, హరీష్  బైక్‌పై అతివేగంతో ప్రయాణిస్తుండగా నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడమే చనిపోయారు.  సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.  మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు.  అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని  స్పష్టం చేశారు.