రెడిమిక్స్‌ మిక్సర్‌ క్లీనింగ్‌ మెషీన్‌లో పడి ఇద్దరు నుజ్జునుజ్జ

రెడిమిక్స్‌ మిక్సర్‌ క్లీనింగ్‌ మెషీన్‌లో పడి ఇద్దరు  నుజ్జునుజ్జ

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  రెడిమిక్స్‌ మిక్సర్‌ క్లీనింగ్‌ మెషీన్‌లో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.  మిక్సర్లో మృతదేహాలు  నుజ్జునుజ్జయ్యాయి. మిక్సర్‌ క్లీనింగ్‌ చేసేందుకు ఇద్దరు యువకులు లోపలికి వెళ్లారు. అది చూసుకోకుండా ఆపరేటర్‌ మెషీన్ ఆన్‌ చేయడంతో ఇద్దరు యువకులు అందులోనే  నుజ్జునుజ్జయ్యారు.  వీరిని సోరేన్‌, సుశీల్‌ ముర్ముగా గుర్తించారు.  

నార్సింగి పరిధి పుప్పాలగూడలోని నిర్మాణ సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా  రహస్యంగా ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం. కానీ విషయం బయటపడటంతో  మృతుల బంధువులు నిర్మాణ సంస్థపై దాడికి దిగారు.  పరిశ్రమ కార్యాలయంలో ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు.  సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు  అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ALSO READ :- చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్