
బాచుపల్లి : మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయబోతుండగా పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. ఈ సంఘటన సోమవారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికను డబ్బులు ఇస్తామంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు. స్థానికులు యువకులను గమనించి వారికి దేహశుద్ధి చేశారు. తర్వాత బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. నిందితులను పోలీసులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యులు స్థానికంగా చెత్త వేరుకుంటూ నివాసముంటున్నట్లు తెలుస్తుంది. యువకులపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశామన్నారు పోలీసులు.