
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి,గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఈరోజు(మంగళవారం జూలై 15) భూమికి తిరిగి రానున్నారు. ఆక్సియం4 మిషన్ లో భాగంగా కాలిఫోర్నియా తీరంలో స్ప్లాష్‌డౌన్ షెడ్యూల్ చేసింది అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా.
భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుక్లా, ముగ్గురు సహ వ్యోమగాములు పెగ్గీ విట్సన్ (USA), స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగరీ)లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3:01గంటలకు కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో స్క్యూ క్యాప్సూల్ లాండ్ కానుందని అంచనా.
సోమవారం (జూలై 14) సాయంత్రం 4.45 గంటలకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక గ్రేస్ ISS హార్మొనీ మాడ్యూల్ నుంచి అన్‌లాక్ అయింది. ISS నుంచి సురక్షితంగా బయలుదేరినట్లు SpaceX నిర్ధారించింది.
తిరుగు ప్రయాణం దాదాపు 23 గంటలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 18 రోజుల మైక్రోగ్రావిటీ లో అనేక పరిశోధనలు చేసిన శుభాన్షు శుక్లా బృందం భూమి గురుత్వాకర్షణకు అనుగుణంగా శుక్లా 7 రోజుల తన తిరిగి భూమిపై సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తారు.ఆక్సియం 4 మిషన్ మొదట 14 రోజుల పాటు ప్లాన్ చేశారు. అయితే తర్వాత శుక్లా మిషన్‌ను 18 రోజులకు పొడిగించారు. ఈ కాలంలో శుభాన్షు శుక్లా ISSలో అనేక శాస్త్రీయ ప్రయోగాలు,పరిశోధనలు చేశారు.
ALSO READ : ఇవాళ(జులై 15) భూమిపైకి శుభాంశు శుక్లా
అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారత వ్యోమగామి
శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామి.1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో మొదటిసారి అడుగుపెట్టారు. శుభాన్షు శుక్లా విజయవంతంగా తిరిగి రావడం భారతదేశ దీర్ఘకాల అంతరిక్ష ఆకాంక్షలను గౌరవించడమే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో దేశం పాత్రను పటిష్టం చేస్తుంది.
భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష విమాన మిషన్లకు భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో యాక్స్-4 కింద ఈ మిషన్ ఓ చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది.