Tesla India: ముంబైలో తెరుచుకున్న టెస్లా షోరూం.. Y మోడల్ ఆన్‌రోడ్ రేట్లివే..

Tesla India: ముంబైలో తెరుచుకున్న టెస్లా షోరూం.. Y మోడల్ ఆన్‌రోడ్ రేట్లివే..

Tesla Y Model: చాలా కాలంగా ఆటో లవర్స్ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. అమెరికా దిగ్గజ ఈవీ కార్ మేకర్ టెస్లా భారతదేశంలో తన తొలి షోరూం ముంబైలో నేడు ప్రారంభించింది. ముంబైలో తొలి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతోషం వ్యక్తం చేశారు. టెస్లా నగరంలో ఈవీ మెుబిలిటీ కోసం అవసరమైన ఇన్ ఫ్రా ఏర్పాటు చేస్తుందన్నారు. 

అలాగే టెస్లా తన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే అందుకు తమ రాష్ట్రం ఉత్తమమైన ఎంపిక అని షోరూం సందర్శనకు వెళ్లిన సమయంలో చెప్పారు. తాజా ఎంట్రీతో టెస్లా తన మోడల్ వై వేరియంట్లను భారత మార్కెట్లలోకి తీసుకొచ్చింది. ముందుగా ఈ కార్లు ముంబై షోరూంలో అందుబాటులో ఉండాయని ఆ తర్వాత రానున్న కాలంలో వీటిని ఢిల్లీ, గురుగ్రాములో కూడా విక్రయానికి అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వెల్లడించింది. 

ALSO READ : శుభాన్షు శుక్లా భూమికి వస్తున్నాడు..జూలై15 మధ్యాహ్నం 3గంటలకు ల్యాండింగ్

 

టెస్లా కార్ల విక్రయ ధరలు..
* Tesla Model Y RWD ధర రూ.59.89 లక్షలు (ముంబైలో)
* Tesla Model Y Long Range RWD - ధర రూ.67.89 లక్షలు (ముంబైలో)

ఇక టెస్లా మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇదే క్రమంలో లాంగ్ రేంజ్ ఆర్డబ్యూడీ మోడల్ 622 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అలాగే ఇవి కేవలం 15 నిమిషాల పాటు చార్జ్ చేస్తే మెుదటి మోడల్ 238 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ మోడల్ 267 కిలోమీటర్లు అదనపు మైలేజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. అలాగే కేవలం 6 సెకన్లలోపే ఈ కార్లు 100 కిలోమీటర్ల స్పీడును అందుకోగలవని వెల్లడైంది. 

ప్రస్తుతం కంపెనీ ఈ కార్లను ఇండియాలో 6 రంగుల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రే, పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ, క్విక్ సిల్వర్, అల్ట్రా రెడ్ రంగుల్లో కార్ అందుబాటులో ఉంటాయి.