
ఈత సరదా వారి కొంప ముంచింది.. సరదాగా ఈత కొడదామని మూసీలోకి దిగిన ఇద్దరు యువకులు కనిపించకుండాపోయారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్పరిధిలోని బుద్వేల్ లో మూసీ బ్యాక్ వాటర్లోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు ఇద్దరు యువకులు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ లో హిమాయత్ సాగర్ బ్యాక్ మూసీలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, NDRF బృందాలు గల్లంతైన యువకులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుల వివరాలు తెలియాల్సి ఉంది.