ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా

ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా

భోపాల్‌‌‌‌: ఇండియా, ఆస్ట్రేలియా అండర్‌‌‌‌–18 మెన్స్‌‌‌‌ హాకీ జట్ల మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌‌‌‌ 3–3తో డ్రా అయ్యింది. దాంతో నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ 1–1తో సమమైంది. ఇండియా తరఫున కరణ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ (10వ ని), బెన్‌‌‌‌ సిద్ధార్థ్‌‌‌‌ (14వ ని), కేతన్‌‌‌‌ కుష్వాహా (40వ ని) గోల్స్‌‌‌‌ చేశారు. జెట్‌‌‌‌ జాన్‌‌‌‌స్టోన్‌‌‌‌ (18, 25వ ని), ఆండ్రూ ఫాల్డ్స్‌‌‌‌ (57వ ని) ఆసీస్‌‌‌‌కు గోల్స్‌‌‌‌ అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియా.. ఆసీస్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌పై ఎదురుదాడి చేసింది. అండర్‌‌‌‌–18 విమెన్స్‌‌‌‌లో ఇండియా 4–1తో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకుంది.