సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ల దాడి

సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ల దాడి

రియాద్సౌదీ అరేబియాలోని రెండు ఆయిల్ ఫెసిలిటీస్​పై డ్రోన్ల దాడి జరిగింది. సౌదీ ఆరాంకో కంపెనీకి చెందిన రెండు ఆయిల్‌‌ యూనిట్లే  టార్గెట్‌‌గా  శనివారం దాడులు జరిగాయని ఆ దేశ హోంశాఖ తెలిపింది. తూర్పు సౌదీలోని అబ్​ఖియాక్(బుఖ్యాక్), ఖురాయిస్​లో ఆయిల్​ఫెసిలిటీస్​పై ఎటాక్ జరిగిందని చెప్పింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయని, దట్టమైన పొగ వ్యాపించిందని వివరించింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆరాంకోకు చెందిన ఇండస్ట్రియల్ సెక్యూరిటీ టీమ్స్.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని, తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పింది. అయితే  ఈ ఘటనల్లో ఎవరైనా చనిపోయారా? రెండు ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయా? లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది. డ్రోన్ల సోర్స్ ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. ఎటాక్ చేసింది తామేనని యెమన్ రెబల్స్ ప్రకటించారు. అబ్​ఖియాక్, ఖురాయిస్ ఆయిల్​రిఫైనరీలపై దాడి చేసేందుకు యెమెన్ రెబల్స్ 10 డ్రోన్లు ఉపయోగించారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

అబ్ఖియాక్ రిఫైనరీ..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ రోజుకు 7 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్​ప్రాసెస్ అవుతుంది. 2006 ఫిబ్రవరిలో అల్-ఖైదా ఆత్మాహుతి దళాలు అబ్​ఖియాక్ రిఫైనరీపై దాడి చేశాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను చంపి, లోపలికి వెళ్లేందుకు టెర్రరిస్టులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కాంపౌండ్​ను దాటి వెళ్లలేకపోయారు. ఇద్దరు బాంబర్లు హతమయ్యారు.

ఇదే మొదటిసారి కాదు..

  • సౌదీ అరేబియాలోని ఆయిల్​రిఫైనరీలపై దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఇప్పటికే చాలా జరిగాయి. గతంలో ప్లాంట్లను స్వాధీనం చేసుకునేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు.
  • ఆగస్టులో ఆరాంకోలోని షయ్బా నేచురల్ గ్యాస్ లిక్యుఫ్యాక్షన్ ఫెసిలిటీపై యెమన్​కు చెందిన హుతి రెబల్స్ దాడి చేశారు. భారీగా మంటలు చెలరేగినా ప్రాణనష్టం జరగలేదు.
  • మే నెలలో ఆయిల్​పంపింగ్​స్టేషన్లపై రెబల్స్​డ్రోన్లతో దాడి చేశారు. దీంతో పంపింగ్​స్టేషన్లు కొన్ని రోజులపాటు బంద్ అయ్యాయి.