అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌ .. 214 రన్స్‌ తో ఇండియా గ్రాండ్ విక్టరీ

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌ ..  214 రన్స్‌ తో ఇండియా గ్రాండ్ విక్టరీ
  • సూపర్ సిక్స్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్తు
  • చెలరేగిన ఆదర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌమీ పాండే
  • అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా జోరు

బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోంటీన్:  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్లకు ఎదురులేకుండా పోయింది. ఆడిన ప్రతీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ విజయంతో దూసుకుపోతున్నారు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (126 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 131) రెండో సెంచరీతో చెలరేగగా, మంగళవారం జరిగిన సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 214 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 295/8 స్కోరు చేసింది. ఆదర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (58 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 52) రాణించాడు. తర్వాత కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 28.1 ఓవర్లలో 81 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. ఆస్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాక్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సౌమీ పాండే 4 వికెట్లు తీశాడు. ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. 

ఇద్దరే ఆడిన్రు..

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అర్షిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9) ఔటయ్యాడు. దీంతో 28/1తో కష్టాల్లో పడిన ఇండియాను ఆదర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గట్టెక్కించారు. అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌండ్రీతో ఖాతా తెరిచిన ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నలుమూలల షాట్లు కొడుతూ కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉతికేశాడు. లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లాంగాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా మూడు భారీ సిక్సర్లు కూడా బాదాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మంచి సహకారం అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తి సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో వీరిద్దరు 61/1 స్కోరు చేశారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1/37) విడగొట్టాడు. ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్​తో ఆదర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34)కు మంచి ఆరంభం దక్కినా భారీ స్కోరుగా మల్చలేకపోయాడు. ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 61 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేయగా, మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 87 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసి సహరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుదిరిగాడు. అప్పటికి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 192/3 కాగా ఇక్కడి నుంచి కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు పట్టు బిగించారు. ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టి రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వికెట్లు తీశారు. ఆరవల్లి అవనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17), ప్రియాన్షు మోలియా (10), సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15), అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 109 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంచరీ పూర్తి చేసినా.. 97 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలోఆరు వికెట్లు పడటంతో ఇండియా స్కోరు 300 దాటలేదు. మాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు తీశాడు. 

సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా బౌలర్లు సౌమీ పాండే (4/19), రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింబానీ (2/17), ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/10) ముప్పు తిప్పలు పెట్టారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి లింబానీ ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు కూడా సద్వినియోగం చేసుకున్నారు. జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీల్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10), జాక్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16), అలెక్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థాంప్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12) మాత్రమే డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్ స్కోర్లు సాధించారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం కావడంతో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 100 కూడా దాటలేదు. జాక్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒలివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7) ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జోడించిన 17 రన్సే అత్యధిక భాగస్వామ్యం.