
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దుబాయ్ డీఐఎఫ్‌సీ బ్రాంచ్ ఆన్‌బోర్డ్ కాని కస్టమర్లకు ఫైనాన్షియల్ సర్వీసులు అందించిందని దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించింది. అలాగే కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిషేదించింది. ఈ నిషేధం ఇప్పటికే సేవలు పొందుతున్న కస్టమర్లకు, అలాగే గతంలో సేవలు పొందినవారికి వర్తించదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది.
డీఎఫ్‌ఎస్‌ఏ నుంచి నోటిస్ వచ్చేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని, ఈ పరిణామం ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపదని తెలిపింది. ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ సూజ్ ఏటీ1 బాండ్లను అర్హత లేని రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయించిందనే ఆరోపణలను హెచ్‌డీఎఫ్‌సీ యూఏఈలో ఎదుర్కొంటోంది. క్రెడిట్ సూయిజ్, యూబీఎస్‌తో విలీనమైన టైమ్‌లో ఈ బాండ్ల విలువ జీరో అయ్యింది. ఇన్వెస్టర్లు నష్టపోయారు.