ముంబైలో ఓ క్యాబ్ డ్రైవర్ 15ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఉబర్ డ్రైవర్ మహ్మద్ జలీల్ ఖలీల్(33)పై ఫోక్సో చట్టం కింద కేసు నుమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మార్చి 28న బాధితురాలి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న ఖలీస్ తన కారులో రైడ్ కు వెళ్తామని తీసుకెళ్లాడు. బాలిక మానసిక పరిస్థితి కూడా బాగాలేదు. గత కొంతకాలం క్రితం ఆమె తల్లి చనిపోవడంతో ఓ మహిళా గార్డియన్ సంరక్షనలో బాలిక పెరుగుతోంది. కారులో బాలికలను ఎక్కించుకొని దాదర్ బిడ్జ్ దగ్గరకు తీసుకెళ్లి ఖలీల్ క్యాబ్ వెనుక సీటులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తర్వాత అమ్మాయిని ఆమె ఇంట్లోనే వదిలేసి, ఏం అయినా అవసరమైతే తనకు కాల్ చేయమని నెంబర్ ఇచ్చాడు. బాధితురాలి మెంటల్ కండీషన్ బాలేదు కాబట్టి, బాలిక గార్డియన్ ఇంట్లో అమ్మాయి గురించి ఆరా తీసింది. ఇంటి ఎదురుగా ఉన్న షాప్ యజమాని ఖలీల్ బాలికను కారులో ఎక్కించుకుపోవడం గురించి చెప్పాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న మహిళా సంరక్షురాలు దాదర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడు బాలికకు ఇచ్చిన ఫోన్ నంబర్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు. ప్రత్యేక పోక్సో కోర్టు ఖలీల్‌ను ఏప్రిల్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.