క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొన్న యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొన్న యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొన్న యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • టేకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వలన వచ్చిన లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు స్విస్ సెంట్రల్ బ్యాంక్ గ్యారెంటీ
  • అదనంగా 100 బిలియన్ డాలర్ల సాయం అందించేందుకు ఓకే
  • క్రెడిట్ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫెయిలవ్వకుండా చూడడం చాలా ముఖ్యమన్న  అధికారులు

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  167 ఏళ్ల చరిత్ర గల బ్యాంక్ క్రెడిట్ స్వీస్ కనుమరుగవ్వనుంది.  బ్యాంకింగ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న  స్విస్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేత ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనిపించింది.  ముందు ఒక బిలియన్ డాలర్లను ఆఫర్ చేసిన  యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత డీల్ విలువను 3.25 బిలియన్ డాలర్లకు పెంచింది.  అయినప్పటికీ  శుక్రవారం క్రెడిట్ స్వీస్ షేర్ల క్లోజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  ఈ వాల్యూ 60% తక్కువ.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న 30  సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంకుల్లో  క్రెడిట్ స్వీస్ ఒకటని, ఈ బ్యాంక్ ఫెయిలైతే ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదేలవుతుందని  స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. సోమవారం ఆసియా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రారంభమయ్యే ముందే హుటాహుటిన క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కొనేలా చేసింది. అంతేకాకుండా యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చింది. క్రెడిట్ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనడం వలన వచ్చే లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 బిలియన్ డాలర్ల వరకు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరిస్తుంది. అంతేకాకుండా  లిక్విడిటీ కోసం సుమారు 100 బిలియన్ డాలర్లను కూడా అందిస్తోంది. 22 షేర్లున్న  క్రెడిట్ స్వీస్ ఇన్వెస్టర్లకు  ఒక యూబీఎస్ షేరు దక్కుతుంది. 

బాండ్ హోల్డర్లకు నష్టమే..

 క్రెడిట్ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారు పూర్తిగా మునిగారు. డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం 17.5 బిలియన్ డాలర్ల విలువైన  క్రెడిట్ స్వీస్ బాండ్లు ఇక నుంచి చెల్లవని యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది.  వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ ఇదని స్విస్ నేషనల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోర్డన్ అన్నారు.  క్రెడిట్ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంకుల్లో ఒకటని అన్నారు. యూఎస్ ప్రభుత్వం ఈ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాగతించింది. 

9,000 ఉద్యోగులు ఇంటికే..

డీల్ పూర్తయిన తర్వాత గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  పనిచేస్తున్న సుమారు 9 వేల మంది ఉద్యోగులను తీసేయాలని యూబీఎస్ ప్లాన్స్ వేస్తోంది.  ఉద్యోగులను తీసేయడంలో ఇది ప్రారంభం మాత్రమేనని, ఫైనల్ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉంటుందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రెండు ప్రత్యర్ధి బ్యాంకులు కావడం వలన చాలా చోట్ల ఈ రెండూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.  ఈ రెండు బ్యాంకులకు కలిపి సుమారు 1,25,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. మెర్జింగ్ కంపెనీ ఖర్చులను 2027 నాటికి 8 బిలియన్ డాలర్ల మేర తగ్గిస్తామని యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ కోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెల్లెహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అన్నారు.  లాభాల్లో నడుస్తున్న  క్రెడిట్ స్వీస్  సిట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కొనసాగిస్తామని, వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసక్తిగా ఉన్నామని అన్నారు.  క్రెడిట్ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించకపోవచ్చని చెప్పారు.   కాగా, ఇండియాలో క్రెడిట్ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జూమర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్దగా లేదు.   డెరివేటివ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కీలకంగా ఉంది. ముంబైలో ఓ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెయింటైన్ చేస్తోంది.  

క్రెడిట్ స్వీస్ షేర్లు ఒక్క రోజే 65% డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీగా టేకోవర్ చేయడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. క్రెడిట్ స్వీస్ షేర్లు సోమవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 65 శాతం క్రాష్ అయ్యాయి. శుక్రవారం క్లోజింగ్ ధరతో పోలిస్తే బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  60 శాతం తక్కువకే  యూబీఎస్ కొనుగోలు చేయడమే ఇందుకు  కారణం. మరోవైపు యూబీఎస్ బ్యాంక్ షేర్లు కూడా  5 శాతం నష్టంతో ట్రేడయ్యాయి.  వీటి దెబ్బకు యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బ్యాంక్ షేర్లన్నీ పతనమయ్యాయి. యూరప్ బ్యాంకింగ్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1.8 శాతం పడింది. ఈ ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై కూడా పడింది.

167 ఏళ్ల బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా రోడ్డెక్కిందంటే!

167 ఏళ్ల  కిందట సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్టార్ట్ చేసిన క్రెడిట్ స్వీస్, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాలా దేశాల్లో విస్తరించింది. ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది. ఈ  బ్యాంక్ పతనానికి ముఖ్య కారణం  మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సమస్యలు, స్కాండల్సే.  క్రెడిట్ స్వీస్ షేర్ల పతనం 2021 నుంచే మొదలయ్యింది. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్ ఆర్చిగోస్ అండ్ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిల్ క్యాపిటల్ దివాలా తీయడం బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడకు చుట్టుకుంది. కిందటేడాది జనవరిలో  బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ ఆంటోనియో హోర్టా ఓసోరియో  కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రేక్ చేసినందుకు తన పదవి నుంచి తప్పుకున్నారు.  కొత్త సీఈఓ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాభాల్లోకి తెచ్చేందుకు జులైలో ప్లాన్  రెడీ చేసినా, ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ఫెయిలయ్యారు.  క్లయింట్స్ బ్యాంక్ నుంచి తమ డిపాజిట్లను పెద్ద మొత్తంలో తీసేయడం మొదలు పెట్టారు.  డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 119 బిలియన్ డాలర్లను క్లయింట్స్ విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నారు. ఈ దెబ్బకు 2022 లో  బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 7.29 బిలియన్ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల లాస్ వచ్చింది. తాజాగా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్ క్రైసిస్ ప్రభావం గట్టిగా తగిలింది. కాగా, క్రెడిట్ స్వీస్ హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను మెయింటైన్ చేస్తోంది.