మహారాష్ట్రలో కొత్త చరిత్ర.. ఠాక్రే ఫ్యామిలీ నుంచి తొలి సీఎం

మహారాష్ట్రలో కొత్త చరిత్ర.. ఠాక్రే ఫ్యామిలీ నుంచి తొలి సీఎం
  • డిసెంబరు 1న మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం
  • ఛత్రపతి శివాజీ కలలుకన్న మహారాష్ట్ర సాకారం చేస్తా: ఉద్ధవ్

మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్-ఎన్సీపీలు ఇన్నాళ్లు బద్ద శతృవులుగా ఉన్న శివసేన అధికారికంగా కలిసిపోయాయి. ‘మహా వికాస్ అఘాదీ’ పేరుతో కొత్తగా కూటమిని ఏర్పాటు చేశాయి. మూడు పార్టీల ఎమ్మెల్యేలు తమ నేతగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేను ఎన్నుకున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఎంపికయ్యారు. దాదాపు 5 దశబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలి ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ చరిత్రకెక్కుతున్నారు. గురువారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ సీఎంగా ప్రమాణం చేస్తారు.

MORE NEWS: 

చంద్రయాన్ ఫెయిల్ అయినా.. ఈ సూర్యుడి విజయంపై ధీమా

హైదరాబాద్: ఏడో తరగతి బుడ్డోడు.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్

ఆధునిక బీఎస్ -6 ఇంజిన్‌తో కొత్త బైకులు.. ధర 65 వేల నుంచి..

ముంబైలోని ట్రైడెంట్ హోటల్ లో కాంగ్రెస్-NCP-శివసేన ఎమ్మెల్యేల సంయుక్త సమావేశం జరిగింది. మూడు పార్టీలతో కలిపి మహా వికాస్ అఘాదీ పేరుతో కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు శివసేన నేత ఎక్ నాథ్ షిండే ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు అందరు ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. కూటమికి కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందని అనిల్ దేశాయ్ తెలిపారు. తర్వాత మహా వికాస్ అఘాదీ నేతగా ఉద్ధవ్ ఠాక్రే పేరును NCP ఫ్లోర్ లీడర్ జయంత్ పాటిల్ ప్రతిపాదించారు. కాంగ్రెస్ లీడర్ బాలాసాహెబ్ థోరట్ సమర్థించారు. ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అన్ని ప్రశ్నలకూ సమాధానమిస్తా..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన ఉద్ధవ్‌కు శరద్ పవార్ బొకే అందించి… శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉద్ధవ్ ప్రమాణం చేస్తారని శరద్ పవార్ ప్రకటించారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పారు ఉద్ధవ్.  రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని తానెప్పుడూ కల కనలేదన్నారు. దేవేంద్ర ఫడ్నవిస్ అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానన్నారు. హిందుత్వంలో అబద్ధాలకు స్థానం లేదన్నారు. ఛత్రపతి శివాజీ కలలు కన్న మహారాష్ట్రను సాకారం చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో డిప్యూటీ

అంతకుముందు కాంగ్రెస్-NCP-శివసేనల మధ్య కామన్ మినిమం ప్రోగ్రామ్ సెట్ అయింది. అంతకుముందే సోనియా గాంధీ కూడా ఆమోదం తెలిపారు. CMPపై శివసేన నుంచి ఉధ్ధవ్, కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, NCP నుంచి శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్ సంతకాలు చేశారు. ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కానుండగా… NCP, కాంగ్రెస్ లకు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ ఉపముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది.